సెంచరీలతో సెన్సేషన్ సృష్టించిన పాటలు ఇవే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాలకు సంగీతం ఎలాంటి మేజర్ అసెట్‌గా మారుతుందో మనం ఎప్పటినుండో చూస్తూ వస్తున్నాం. కాగా ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లోని పాటలను నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుండగా, అవి సినిమా రిలీజ్‌కు ముందే ఆయా సినిమాలపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. అయితే కొన్ని పాటలు మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆయా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి.

ఈ జాబితాలో 100 మిలియన్ వ్యూస్ సాధించిన కొన్ని పాటల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇటీవల రిలీజ్ అయిన బ్లాక్‌బస్టర్ చిత్రాల పాటలన్నీ కూడా ఈ ఫీట్‌ను సాధించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన ఉప్పెన చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలోని ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట యూట్యూబ్‌లో ఏకంగా 204 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురుమలో చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులోని బుట్టు బొమ్మ పాట‌కు 575 మిలియ‌న్ల వ్యూస్ రాగా, రాములో రాములా పాటకు 353 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

కాగా గతంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే’ పాట 295 మిలియన్ వ్యూస్‌తో ఊపేసింది. అటు గీతాగోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావ‌లే పాట కూడా సెంచరీ మిలియన్ వ్యూస్‌తో రఫ్ఫాడించింది. కాగా తాజాగా లవ్ స్టోరి చిత్రంలోని సారంగ దరియా పాట కూడా 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. మొత్తానికి ఇలా యూట్యూబ్‌లో సెన్సేషన్ వ్యూస్ తెచ్చుకున్న పాటలు, ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయనేది వాస్తవం. ఇక ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యి, 100 మిలియ‌న్లకుపైగా వ్యూస్ ద‌క్కించుకున్న కొన్ని పాటల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అల‌వైకుంఠ‌పురంలో – బుట్టబొమ్మ – 575 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో – రాములో రాముల – 353 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (లిరిక‌ల్ సాంగ్) – 227 మిలియన్లు
అల‌వైకుంఠ‌పురంలో – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (ఫుల్ సాంగ్) – 173 మిలియ‌న్లు
ఫిదా – వ‌చ్చిండే – 295 మిలియ‌న్లు
ఉప్పెన – నీ క‌ళ్లు నీలి స‌ముద్రం – 204 మిలియ‌న్లు
డీజే – సీటిమార్ – 202 మిలియ‌న్లు
ఛ‌లో – చూసి చూడంగానే – 169 మిల‌యిన్లు
ఎమ్ సి ఏ – ఏవండోయ్ నాని గారు – 118 మిలియ‌న్లు
గీత గోవిందం – ఇంకేం ఇంకేం కావ‌లే (వీడియో ఎడిట్ వెర్ష‌న్) – 115 మిలియ‌న్లు
గీత‌గోవిందం – ఇంకేం ఇంకేం కావ‌లే (లిరిక‌ల్) – 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం – వ‌చ్చింద‌మ్మ – 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం – ఏంటి ఏంటి – 102 మిలియ‌న్లు
ల‌వ్ స్టోరీ – సారంగ‌దరియ – 101 మిలియ‌న్లు