ఆదిపురుష్ టీజర్ ఎలా ఉందంటే ..

యావత్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లోకం ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ టీజర్ వచ్చేసింది. కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో ఉన్న రెబెల్ అభిమానులకు కాస్త ఉపశమనం కల్పించారు ఆదిపురుష్ టీం. ఆదిపురుష్ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ ఈరోజు ఆదివారం రిలీజ్ చేసారు.

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఈరోజు ఆదివారం ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసారు. టీజర్ అంత కూడా ఆసక్తిగా సాగింది. రాముడి గా ప్రభాస్ ఆకట్టుకోగా, బ్యాక్ గ్రౌండ్ అంత గ్రాఫిక్స్ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంది. ఓవరాల్ గా టీజర్ తో సినిమా ఫై మరింత అంచనాలు పెంచారు .