‘నేను మాల్దీవుల బ్యాచ్‌ కాదు’

నెటిజన్‌కు ఆదాశర్మ కౌంటర్‌

Adah Sharma
Adah Sharma

కరోనా లాక్‌డౌన్‌తో దాదాపు 6 నెలలలపాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు మళ్లీ యథావిధిగా బిజీ అవుతున్నారు..

ముఖ్యంగా స్టార్స్‌ విదేశీ ప్రయాణాలకు ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతం యుఎస్‌, యూకేతో పాటు యూరప్‌ దేశాల్లో కరోనాకేసులు అధికంగా ఉన్నాయి.

దీంతో మాల్దీవులు, దుబాయ్ కి స్టార్స్‌ క్యూ కడుతున్నారు. చాలా మంది హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లి ఫొటోలను షేర్‌చేస్తూ ఉన్నారు.

ఇటీవల ఆదాశర్మ కూడ ఒక వీడియోను , ఫొటోలను షేర్‌ చేయటంతో ఆమె కూడ మాల్దీవులకు వెళ్లిందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. .

.అయితే తాను మాల్దీవులకు వెళ్లలేదని, షూటింగ్‌లో భాగంగా మహారాజాపురంలో ఉన్నాను.అంటూ పేర్కొంది..

తమిళనాడు, కేరళ మధ్య ఉండే ఈ మహారాజాపురంలోని అందమైన లొకేషన్లలో తాను షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిపింది..

ఇదేం మాల్దీవులు కాదు. అంటూ ఇండైరెక్టుగా తాను మాల్దీవుల్‌ బ్యాచ్‌ కాదు అంటూ వారికి కౌంటర్‌ ఇచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/