స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘క్లాప్‌’

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జోడీగా

Aadi piniseytty-Akamsha Singh

ఆది పినిశెట్టి , ఆకాంక్ష సింగ్‌ జంటగా శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ శ్రీ షిర్డీసాయి మూవీస పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖరరెడ్డి సంయక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘క్లాప్‌ ‘.

బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ అధినేత ఐబి కార్తికేయన్‌ సమర్పిస్తున్నారు. పృధిని ఆదిత్య ఈచిత్రానికి దర్శకుడు.. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న క్లాప్‌ షూటింగ్‌ ముగింపు దశలో ఉంది..

లాక్‌డౌన్‌ తర్వాత బుధవారం చెన్నైలో షూటింగ్‌ పునరుద్ధరించారు.. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ నిర్వహిస్తున్నారు..

Prakash Raj

హీరో ఆదిపినిశెట్టి , కీలకపాత్రధారి ప్రకాష్‌రాజ్‌ , ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

త్వరలో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/