హాస్పటల్ లో హీరో విక్రమ్..

‘అపరిచితుడు’ ఫేమ్ విక్రమ్ చియాన్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని కుటుంబసభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలియజేసారు. ప్రస్తుతం యాంజియోథెరపీ చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్స్ తెలిపారు. తమ అభిమాన హీరో హాస్పటల్ లో జాయిన్ అయ్యారని తెలిసి ఆయన ఆరోగ్యం ఫై అభిమానులు , ఇటు సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ సెల్వన్‌ టీజర్‌ లాంచ్‌కి విక్రమ్‌ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడంతో ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళనాట ఉన్న స్టార్‌ హీరోల్లో చియాన్‌ విక్రమ్‌ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అపరిచితుడు , ఐ చిత్రాల్లో అద్భుతమైన నటన కనపరిచి అందర్నీ కట్టిపడేసాడు విక్రమ్. ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.