చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ పేరు మార్పు ..

chiranjeevi twitter account name change

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ పేరును మార్చుకున్నారు. నిన్నటివరకు చిరంజీవి కొణెదల గా ఉండగా..ఇప్పుడు ఆచార్య గా మార్చారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తన ట్విట్టర్ అకౌంట్ ను ఆచార్య గా చేంజ్ చేసి , సినిమా ప్రమోషన్ ను మొదలుపెట్టారు. అంతే కాదు ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా శుభాకాంక్షలు అందజేస్తూ..తన కుమారుడు రామ్ చరణ్ కు సంబంధించి మనసుకు హత్తుకునే ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవికి స్వతహాగా హనుమంతుడంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు.ఈరోజు హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు.

కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా.. హనుమ ప్రతిరూపమైన ఓ వానరం అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్ గా చిరంజీవి పెట్టారు. ఇక ఆచార్య మూవీ లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !#happyhanumanjayanthihttps://t.co/SiZ2fbdyJ0@AlwaysRamCharan— Acharya (@KChiruTweets) April 16, 2022