తల్లితో కలిసి మరణించిన జర్మనీ కాల్పుల నిందితుడు

German shootings Accused
German shootings Accused

జర్మనీ: జర్మనీలోని హనావ్ నగరంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 9 మందిన పొట్టనబెట్టుకున్న దుండగుడు తన అపార్ట్ మెంట్ లోనే విగతజీవిలా కనిపించాడు. హనావ్ లోని రెండు స్మోకింగ్ బార్లపై కాల్పులు జరిపిన టోబీ ఆర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ అపార్ట్ మెంట్ లో రెండు మృతదేహాలను గుర్తించారు. వాటిలో ఒకటి టోబీ ఆర్ ది కాగా, మరొకటి అతని తల్లిదని భావిస్తున్నారు. సంఘటన స్థలంలో పోలీసులు ఓ లేఖ, వీడియో స్వాధీనం చేసుకున్నారు. జర్మనీలో నివసిస్తున్న కొందరిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని టోబీ ఆర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అతివాద భావజాలంతో ప్రేరేపితుడైన టోబీ ఆర్ జర్మనీలో ఉంటున్న టర్కిష్, కుర్దిష్ శరణార్థులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/