ప్రత్యేక ఆకర్షణగా ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ స్టాల్

A special attraction is the encore-alcome stall

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఏస్‌టెక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ ప్రారంభమైంది. జనవరి 21 వరకు ఇది జరుగనుంది. అల్యూమినియం డోర్స్‌, విండోస్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ స్టాల్ ను కంపెనీ ఫౌండర్‌, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి, 23 డిగ్రీస్ ఆర్కిటెక్టులు అవుతు శ్రీకాంత్ రెడ్డి, రఘురాం, ఆల్కమ్‌ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్, ఎన్‌కోర్‌ డైరెక్టర్లు అవుతు పవన్ కుమార్ రెడ్డి, శ్రీ హర్ష తదితరులు ప్రారంభించారు.

1.8 టన్నుల బరువున్న 18 అడుగుల ఎత్తైన విండోను ప్రదర్శిస్తున్నామని ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ ఫౌండర్‌, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. కంపెనీ తయారు చేస్తున్న విభిన్న, వినూత్న ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయని చెప్పారు. కంపెనీకి హైదరాబాద్, గుజరాత్ లోని సూరత్ వద్ద ప్లాంట్లు ఉన్నాయి.