బిగ్ బాస్ 5 : 8 వారానికి గాను నామినేషన్‌ లిస్టు

బిగ్ బాస్ 5 : 8 వారానికి గాను నామినేషన్‌ లిస్టు

బిగ్ బాస్ 5 సీజన్ సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 19 సభ్యులతో బిగ్ బాస్ సీజన్ మొదలవ్వగా..ఇప్పటి వరకు ఏడుగురు సభ్యులు హౌస్ ను వదిలి వెళ్లడం జరిగింది. తాజాగా ఏడో వారానికి గాను ప్రియా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఎనిమిదో వారానికి జరిగిన నామినేషన్ పక్రియ లో ఆరుగురు సభ్యులు నామినేట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ నామినేషన్ ప్రక్రియను హల్ చల్ చేశారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియలో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ప్రస్తుత వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తిగా మారింది.

బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియను లెటర్స్‌ను ఆధారంగా చేసుకొని ప్రారంభించారు. కన్ఫెషన్ రూమ్‌లో ఉండే కంటెస్టెంట్లు.. ఎవరికైతే తమ తోటి కంటెస్టెంట్లకు లెటర్స్ ఇస్తారో వారు నామినేషన్ ప్రక్రియలో ఉండదు. ఎవరికైతే ఇవ్వరో వారు నామినేషన్ ప్రక్రియలో ఉంటారు అని బిగ్‌బాస్ నిబంధన చెప్పారు. అయితే కొందరు సభ్యులు తమ తోటి సభ్యులకు లెటర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తూ.. వాటిని స్క్రాప్ చేయడం కనిపించింది. కాగా ఈ వారం అందులో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్, యాంకర్ రవి, లోబో లు నామినేషన్ లో ఉన్నారు. టాప్ సభ్యులు నామినేషన్ లో ఉండడం తో ఈసారి ఎవరు బిగ్ బాస్ హౌస్ ను విడిచివెళ్తారో ఆసక్తి గా మారింది.