హైదరాబాద్ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్!

రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నా

న్యూఢిల్లీ : నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు తన పర్యటన వివరాలను మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రెండు కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని మోడీ తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఆవిష్కరణల రంగంలో ఈ సంస్థ విశేషమైన కృషి చేస్తోందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటానని మోడీ చెప్పారు. తన పవిత్రమైన ఆలోచనలు, ఆథ్యాత్మిక బోధనలతో మనల్ని ఉత్తేజితం చేసిన రామానుజాచార్యుల వారికి ఇది ఘన నివాళి అని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/