కెనడాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి

6 Dead As Plane Carrying Workers Crashes In Canada’s Far North

ఒట్టావా: కెనడా కార్మికులతో వెళ్తున్న ఓ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నార్త్‌వెస్ట్‌ టెరిటరీస్‌ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పోర్ట్‌స్మిత్‌ నుంచి కార్మికులతో రియో టింటో మైనింగ్‌ సంస్థకు చెందిన దియావిక్‌ వజ్రాల గని వద్దకు ఆ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కాసేపటికే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.