కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

5 Terrorists Killed In J&K’s Kulgam Encounter, Operation Underway

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా దంహాల్‌ హంజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గురువారం సాయంత్రం 4 గంటలకు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. అదికాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు ప్రాంభమయ్యాయి.

దీంతో ఇప్పటివరకు ఐదురు ముష్కరులను మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. జరిగింది. గత నెలలో ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు.