రేపు చెన్నైలో అమిత్‌ షా పర్యటన

పర్యటనకు 7 వేల మంది పోలీసులతో భారీ భద్రత

home-minister-amit-shah

న్యూఢిల్లీ: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై బిజెపి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు చెన్నైకు వెళ్తున్నారు. రేపు ఉదయం అమిత్ షా చెన్నైకి చేరుకుంటారు. అనంతరం టి.నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో పార్టీ కీలక నేతలతో భేటీ అవుతారు. పార్టీ అభివృద్ధి, అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సి వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం చేపాక్ కళావానర్ అరంగంలో జరిగి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన చెన్నైలోని లీలాప్యాలెస్ హోటల్ లో విశ్రాంతి తీసుకుంటారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో చెన్నైలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కమలాలయం, కళైవానర్ అరంగం, లీలాప్యాలెస్ హోటల్ వద్ద 7 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/