వారి నేరాలను తమకు అంటగడుతున్నారు : విజయసాయిరెడ్డి

ఏపీలో అత్యాచారాలకు టీడీపీ నేతలే కారణమని ఆరోపణ

అమరావతి: వైస్సార్సీపీ నేతల వల్లే ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లడుతూ.. టీడీపీ నేతలే కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. ఏపీలో అత్యాచారాలు టీడీపీ నేతల పనేనని అన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసే అత్యాచారాలను, హత్యలను వైస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా, వైస్సార్సీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని, గతంలో కంటే ఈసారి తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని భయపడేవాళ్లే పొత్తుల గురించి ఆలోచిస్తారని అన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదని తెలిపారు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని విజయసాయి స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/