మునుగోడు లో భారీగా పట్టుబడిన నగదు..

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. పుట్టపాక వెళ్లే దారిలో ఈరోజు రూ. 19 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు లో అన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో డబ్బును కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రోజు వెంట నడిచే కార్య కర్తలకు రోజు వెయ్యి రూపాయలకు వరకు ఇస్తూ మందు , బిర్యానీ ఇలా అన్ని ఇస్తూ బంగారంలా చూసుకుంటున్నారు. అంతే కాదు ఓటర్లను కూడా దేవుడిలా చూసుకుంటున్నారు. వారు ఏంకావాలంటే అవి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కార్ కనిపించడం తో దానిని ఆపి చెక్ చేయగా..అందులో కోటి రూపాయిలు లభ్యం అయ్యాయి. ఈ కారు బీజేపీకి చెందిన ఓ నేత వాహనమని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగానే ఈరోజు గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో ఈ వాహనాన్ని పోలీసులు ఆపి చెక్‌ చేయగా, డబ్బులు బయటపడ్డాయి. TS 07 FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న రూ. 19 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నగదు పట్టుబడ్డ వాహనంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు, ఫ్లెక్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.