హైకోర్టులో టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ

టీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

TS High Court
TS High Court

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భాంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలీన గుర్తును కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ వేసిన పటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మునుగోడు స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని ఎన్నికల కమిషన్‌ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్‌పై ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, టీఆర్‌ఎస్‌ గుర్తు అయిన కారును పోలి ఉన్న గుర్తులను ఇతరులకు కేటాయించడం వల్ల తమ పార్టీకి వచ్చే ఓట్లన్నీ ఇతర పార్టీకి పోయే అవకాశం ఉందని, ఆ గుర్తుల స్థానంలో వేరే గుర్తును కేటాయించాలని టీఆర్‌ఎస్‌ పిటిషన్‌లో కోరింది. ఈ గుర్తుల విషయంలో ఎన్నికల కమిషన్‌ తీరును తప్పుబడుతూ చండూరు ఆర్వో కార్యాలయం ముందు, నల్గొండ కలెక్టరేట్‌ ముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా టీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు తర్వాత టీఆర్ఎస్‌ ఎలా ముందుకెళ్తుందనేది వేచి చూడాలి.