స్కూటీ ఢీకొని 14 నెలల చిన్నారి మృతి

14-months baby
14-months baby

హైదరాబాద్‌: నగరంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటి ఢీకొని 14 నెలల బాలుడు మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడుని ఎత్తుకొని జయబేరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో మాదాపూర్ వైపు వెళ్లుతున్న స్కూటీ అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డ సతిష్ అనే 14 నెలల చిన్నారి మృతి చెందాడు. రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్కూటీ ప్రమాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/