కుప్పకూలిన పాకిస్థాన్‌ యుద్ధ విమానం

pakistan-air-force-aircraft-crashed

ఇస్లామాబాద్‌: ఈరోజు పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ శిక్షణలో భాగంగా టేకాఫ్ కాగా అటాక్‌లోని పిండిగెబ్ సమీపంలో అది కుప్పకూలింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. కాగా యుద్ధ విమానం కూలిన ఘటనపై బోర్డు ద్వారా దర్యాప్తు చేయనున్నట్లు పాకిస్థాన్ వాయుసేన (పీఏఎఫ్) చెప్పింది. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన ఐదవదని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/