సిఎం పినరయి విజయన్‌ కు బెదిరింపు కాల్‌

12-year-old issues death threat to Kerala CM.. police register case

తిరువనంతపురంః కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు బెదిరింపు కాల్‌ వచ్చింది . సీఎంను చంపేస్తామంటూ కేరళ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ వెంటనే విచారణ చేపట్టింది. పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆ ఫోన్‌ చేసింది ఓ మైనర్‌ బాలుడని వెల్లడైంది. ఎర్నాకులంకు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు హత్య బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, అనుకోకుండా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌కాల్ వెళ్లినట్లు బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.