ఘోర ప్రమాదం..కూలిన పాఠశాల జిమ్‌ పైకప్పు.. 10 మంది మృతి

10 dead, 1 trapped after school gym roof collapse in China

బీజింగ్‌: చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో క్వికిహార్‌లోని ఓ మిడిల్‌ స్కూల్‌లో జిమ్‌ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది . దీంతో పది మంది మరణించారు. శిథిలాల కింద మరొకరు చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 5:30 గంటల వరకు శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశామన్నారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తుండగా ఆరుగురు మరణించారు. 39 ఫైర్‌ ట్రక్కులు, 160 మంది ఫైర్‌ఫైటర్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు. జిమ్‌ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీవర్షాల వల్ల జిమ్ పైకప్పు కూలిందని చెప్పారు.