పోలవరానికి అన్నీ అవరోధాలే!

పూర్తి నిర్మాణానికి ఇంకా రూ.30వేల కోట్లు అవసరం

రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడంతో సరిపెడుతున్నారు. న్యాయపరమైన పోరాటానికి ఈ ప్రాజెక్టుకు దిక్కులేకుండా పోయింది. 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారమే కేంద్రం నిధులు ఇస్తే తుదకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కూడా నిర్మించడం కుదరదు. గమనార్హమైన అంశం ఏమిటంటే 1951లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 129 కోట్లు కాగా 1986లో రూపొందించిన డిపిఆర్‌ ప్రకారం 2665 కోట్లు మాత్రమే. 2010-11కి 16010.45 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుతం 55,656.87 నుండి 47,725.74 కోట్ల మధ్య తన్నుకులాడుతోంది. కేంద్రమంత్రి తాజాగా 2013-14 అంచనాల ప్రకారం 20,397.41 కోట్లు మాత్రమే గతి అంటున్నారు. 2014 నుండి ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు వ్యయం జరిగింది కేవలం 12,295 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా దాదాపు 30వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది.

కే ద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యా యం జరిగింది. అదే సమయంలో 32మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రభుత్వరంగంలో నెలకొల్పబడిన విశాఖఉక్కు కర్మా గారం ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైంది. ఆఖరుగా ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టు అంచనాల గురించి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ లోక్‌సభలో నరా పురం యంపి రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన సమాధానంతోదానికి గ్రహణం పట్టింది. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన రివైజ్డ్‌కాస్ట్‌ అంచ నాల కమిటీ ప్రతిపాదనల తర్వాతనే కేంద్ర ఆర్థికశాఖ 2013-14 షెడ్యూల్‌ రేట్లు ఆమోదించినట్లు లోక్‌సభలో తెలియచేశారు. ఇక ఇది ఫైనల్‌.అయితే అంతక్రితం ఆమోదించిన అంచనాల గురించి చెబుతూ సరైన సమయంలో ఎప్పుడో పరిశీలించుతామని చెప్ప డంతో పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలోపడింది.

ఆంధ్ర ప్రదేశ్‌పై కేంద్రప్రభుత్వం దెబ్బమీద దెబ్బ తీస్తున్నా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదు.ఇంత అన్యాయం జరుగు తున్నా రాష్ట్రంలో కమలనాథులు ఇంకేవేవో గణాంకాలు సోషల్‌ మీడియాలో పొందుపర్చి గుళ్లుగోపురాలకు జరిగే అపచారంగురించి మాట్లాడుతున్నారు. కాని రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయం వీరికి పట్టడం లేదు.రాష్ట్ర విభజన చట్టం 90(4)మేరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిగా పోలవరం ప్రాజెక్టు నిర్మించవలసి ఉంది. ‘ద సెంట్రల్‌ గవర్నమెంట్‌ షల్‌ ఎగ్జిక్యూటివ్‌ ది ప్రాజెక్టు అండ్‌ అబ్టైన్‌ ఆల్‌ రిక్విజిట్‌ క్లియరెన్స్‌ ఇన్‌ క్లూడింగ్‌ ఎన్నిరాన్‌మెంటల్‌ ఫారెస్టు అండ్‌ రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటెల్‌మెంట్‌ విభజన చట్టంలో 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారం నిర్మించుతామనిఎక్కడా పేర్కొనలేదు

.కాని కేంద్రమంత్రి 2013-14 నాటి ధరలకు మించి పెంచడం కుదరదని ఆర్థికశాఖ పంపిన కేబినెట్‌ నోట్‌లో ఉందని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక ఏమిటో కేంద్రమంత్రి వివరించలేదు.కేంద్ర మంత్రిప్రకటన తర్వాత రాష్ట్రప్రభుత్వం2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ఏవిధంగానూ సాధ్యంకాదు.ఇటీవల పలుమార్లు ఢిల్లీవెళ్లి కేంద్రమంత్రులను, అధి కారులను కలిసి వచ్చిన రాష్ట్ర ఆర్థికమంత్రి విన్నపాలు అంతక్రితం ముఖ్యమంత్రి విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. రేపు జూన్‌ నెలలో గోదావరికి వరద వచ్చేలోపు మూడువేల కోట్లకుపైగా వ్యయంచేయనిదే నిర్వాసితులకు సహాయపునరావాస కార్యక్రమాలు పూర్తికావు.

పోలవరం ప్రాజెక్టు అంశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొద లుకొని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రాజెక్టు ఆథారిటీ డ్యాం డిజైన్‌ రివ్యూ పానల్‌ కమిటీ కేంద్ర జలవనరుల శాఖమంత్రి, ఆ శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాలకమిటీ, వీటన్నింటిపైన కేంద్ర ఆర్థికశాఖ అందరూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించి ప్రాజెక్టుకు గ్రహణం పట్టించారు. 2021 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 2022 ఖరీఫ్‌ నాటికి గ్రావెటీ ద్వారా గోదావరి జలాలను తరలించుతామని రాష్ట్రప్రభుత్వం చెబుతోందేగాని నిర్దిష్ట ప్రణా ళికలేదు.ఇందుకు అవసరమైన నిధులు ఏవిధంగా సమీకరించు తారో వివరణ లేదు. మొన్న నవంబర్‌లో ముఖ్యమంత్రి జగన్‌ పోలవరం ప్రాజెక్టు పనుల గురించి సమీక్ష నిర్వహించారు.41.15 మీటర్ల ఎత్తువరకు నిర్వాసితులను తరలించి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలనడం, దానితోపాటు ఎడమకాలువ ఉండగా ప్రత్యేకంగా విశాఖకు తాగునీటికి పంపింగ్‌ ద్వారా పైపులైన్‌ ప్రతి పాదనతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై అనుమానాలు వెల్లువెత్తా యి. తదుపరి ముఖ్యమంత్రి ప్రాజెక్టు ఎత్తు తగ్గించేదిలేదని చెబుతూ డ్యాం సేఫ్టీ అండ్‌ స్టెబిలిటీ ప్రొటోకాల్‌ సిద్ధాంతం తెర మీదకు తెచ్చారు.ఇదిలావ్ఞండగా ఇటీవల రెండు దఫాలుగా పోల వరం ప్రాజెక్టు అథారిటీ సిఇఒ అయ్యంగార్‌ ప్రాజెక్టు పనులను సమీక్షించారు. 41.15 కాంటూరు వరకు సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేస్తేనే కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చేందుకు అనుమతి ఇస్తామని ఖరాఖండిగా చెప్పారు. 17600 నివాస గృహాలు నిర్మించవలసి ఉండగా ఇంకా నాలుగువేల గృహాలు నిర్మించవలసి ఉందని ఈలోపు నీటి నిర్మాణం సాధ్యమేనా అని కూడా నిలదీశారు. ఈ కార్యక్రమం పూర్తి చేయాలంటే కనీసం మూడువేల కోట్ల రూపాయలు కావాలి. కేంద్రప్రభుత్వానికి చెందిన అథారిటీ సిఇఒ నిధులు గురించి మాట్లాడటంలేదు.

రాష్ట్రప్రభుత్వం వ్యయం చేసే స్థితిలో లేదు. కేంద్రం కరుణించే అవకాశం అంత కన్నాలేదు. ప్రాజెక్టు పనులు మందగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకొంటున్నారు. పైగా ప్రాజెక్టు అథారిటీ సిఇఒ అయ్యంగార్‌ పోలవరం ప్రాజెక్టు 45.75 మీటర్ల ఎత్తుకు నిర్మించవలసినదేనని సమీక్ష సందర్భంగా చెప్పారు. కాని నిధుల గురించి మాత్రం మాట్లాడలేదు.కాపర్‌ డ్యాం గ్యాప్‌లు పూర్తిగా పూడ్చితేనే ప్రధాన ఆనకట్ట ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం వాల్‌ నిర్మాణం చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తికానిదే కాపర్‌ డ్యాం గ్యాప్‌లుపూడ్చే అవకాశం లేదు. స్పిల్‌ వే స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి అయినా ఉపయోగం ఉండదు. తెలుగుదేశం హయాంలోనే 2019 ఫిబ్రవరి నెలలో అనేక తర్జనభర్జనల మధ్యసాంకేతిక సలహా మండలి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55656.87 కోట్ల రూపాయలుగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ చెబుతున్నట్లు 2017లో కేంద్రమంత్రి వర్గం 2013-14 షెడ్యూల్‌ రేట్ల ప్రకారమే నిధులు చెల్లించాలని చేసిన తీర్మానం ఉంటే 2017-18 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం 2019 ఫిబ్రవరిలో అంచనాలను సాంకేతిక సలహా మండలి ఎందుకు ఆమోదించింది? ఇదంతా కేంద్రమంత్రికి తెలియ కుండా జరిగిందా? కేంద్రమమంత్రివర్గ తీర్మానం తెలిసీ మభ్య పెట్టారా?ఈలోపు ఎన్నికలు రావడం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇది మూలనపడింది.

పైగా వైఎస్సార్‌సీపీ అధికారంలో నికి వచ్చిన తర్వాత కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ప్రాజెక్టు అంచనాల్లో రెండు విధాలుగా గొంతు కోసింది.ఈ సందర్భంలో రాష్ట్రప్రభుత్వం అప్పట్లోనేజాగ్రత్త పడవలసి ఉంది.2017-18 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 55,656.87 కోట్ల అంచనాకు 47,725.74 కోట్ల రూపాయలకు తగ్గించి మెత్తని కత్తితో గొంతు గోసింది. అదే సమయంలో 2013-14 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 29,029.95 కోట్లుగాను తాగునీరు విద్యుత్‌ ప్రాజెక్టు దిమ్మ నిర్మాణం పోగా సాగునీటి వ్యయం కేవలం 20398.81 కోట్ల రూపాయలుగా తేల్చి ప్రాజెక్టును బలిపీఠం ఎక్కించి రెండు ప్రతిపాదనలు ఆర్థికశాఖకు పంపింది. ఇదంతా పరిశీలించితే కేంద్రప్రభుత్వం పథకం ప్రకారం పోలవరం ప్రాజెక్టు బలిపీఠం ఎక్కించినట్లయింది. 2017లో కేంద్రమంత్రివర్గ తీర్మా నానికి ప్రాతిపదిక ఏమిటో కేంద్ర మంత్రిగతంలో కానీ ఇప్పుడూ వివరించలేదు.

రాష్ట్ర విభజన చట్టం మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉంది. తిరిగి పార్లమెంటు ఆమోదం లేకుండా విభజన చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్రమంత్రివర్గం తీర్మానం చేసే అధికారం ఎక్కడిది? ఈ అంశంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడంతో సరిపెడుతున్నారు. న్యాయ పరమైన పోరాటానికి ఈ ప్రాజెక్టుకు దిక్కులేకుండా పోయింది. 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారమే కేంద్రం నిధులు ఇస్తే తుదకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కూడా నిర్మించడం కుదరదు. గమనార్హమైన అంశం ఏమిటంటే 1951లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 129 కోట్లు కాగా 1986లో రూపొందించిన డిపిఆర్‌ ప్రకారం 2665 కోట్లు మాత్రమే. 2010-11కి 16010.45 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుతం 55,656.87 నుండి 47,725.74 కోట్ల మధ్య తన్నుకులాడుతోంది. కేంద్రమంత్రి తాజాగా 2013-14 అంచనాల ప్రకారం 20,397.41 కోట్లు మాత్రమే గతి అంటున్నారు. 2014 నుండి ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు వ్యయం జరిగింది కేవలం 12,295 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా దాదాపు 30వేల కోట్ల రూపాయలు అవసరమవతుంది.

  • వి.శంకరయ్య