హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం

నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇంటిలో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ..ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి లో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ పడటంతో ఆగిన వాహనాలపైకి వెనుక నుంచి ఆ వాహనం దూసుకు వచ్చింది. టిప్పర్ వేగానికి ఏకంగా నాలుగు కార్లు మరియు రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు కావడం తో వారిని వెంటనే అక్కడి స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. టిప్పర్ నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు సరిగా పడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.