వలస కార్మికులతో బయలు దేరిన మరో రైలు

ఈ ఉదయం ఘట్‌కేసర్‌ నుంచి మొదలయిన ప్రయాణం

moving migrant workers to bihar
moving migrant workers to bihar

హైదరాబాద్‌:లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఘట్‌కేసర్‌ నుంచి 1250 మంది వలస కూలీలతో బీహర్‌ రాజధాని పాట్నాకు శ్రామిక్‌ ప్రత్యేక రైలు బయలు దేరింది. నోడల్‌ అధికారులు గుర్తించిన కార్మికులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించినట్లు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. వలస కూలీలను గుర్తించే ప్రక్రియ రెండు రోజుల క్రితమే మొదలయిందని, వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో నమోదు చేసుకున్న వలస కార్మికులను పిలిపించి వారికి రైలు ప్రయాణానికి సంబంధించిన పత్రాలను ఇచ్చామని తెలిపారు. ఇంకా తెలంగాణలో చిక్కుకున్న వలస కూలీల వివరాలు సేకరించి వారిని కూడా వారి స్వరాష్ట్రాలకు చేర్చే పనులలో అధికారులు నిమగ్నమయ్యారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/