కరోనా వాక్సిన్‌కు భారీ ఎత్తున నిధులు

ప్రపంచ నేతల వితరణ రూ. 60,800 కోట్లు… ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమన్న అమెరికా

corona vaccine

అమెరికా: కరోనా మహమ్మారి నియంత్రణకు వాక్సిన్‌ తయారీకి పలు అభివృద్ధి చెందిన దేశాధి నేతలు భారీ ఎత్తున నిధులను ఆర్గనైజేషన్స్ కు అందించేందుకు అంగీకరించాయి. ట్రీట్ మెంట్ నిమిత్తం 8.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 60,840 కోట్లు మంగళవారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రేటు రూ. 76.1150 ప్రకారం) ఇచ్చేందుకు అంగీకరించాయి. అయితే అమెరికా మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, నార్వే, సౌదీ అరేబియా, జపాన్, కెనడా, సౌతాఫ్రికా, చైనా తదితర దేశాల నేతలు, ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ఇతర ప్రపంచ కుబేరులు సైతం ఈ నిధికి తమవంతు సాయం చేసేందుకు అంగీకరించారు. దీని ఫలితంగా 8.1 బిలియన్ డాలర్ల నిధి సిద్ధం కానుందని యూరోపియన్ కమిషన్ హెడ్ ఉర్సులా వాండర్ లీయన్ వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/