రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

raksha bandhan wishes

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని కేసీఆర్ అన్నారు. భార‌తీయ సంస్కృతి, సాంప్ర‌దాయాల్లో గొప్ప ఆచారమ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం మ‌రింత‌గా ఫ‌రిడ‌విల్లాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.

సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సిఎం పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా రక్షాబంధన్ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రాఖీ పండగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి రాఖి పండగను అక్కడి విద్యార్థినులతో జరుపుకోవాలి. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో “కేసిఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ” కట్టే కార్యక్రమం చేపట్టాలని.. రేపు (తేదీన) ప్రతి గ్రామం మరియు బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి, పార్టీ మహిళా విభాగంతో పాటు పార్టీ ఇతర విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహిళ ప్రజా ప్రతినిధులు, మహిళ వార్డు సభ్యులు, సర్పంచ్ లు, మునిసిపల్ కౌన్సిలర్స్, జెడ్పీ చైర్మన్, మేయర్స్, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్ పర్సన్లు అందరూ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.