మందు బాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది

ఇప్పటికే తెలంగాణ సర్కార్ మందుబాబులకు తీపి కబురు తెలుపగా..ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా తెలంగాణ ప్రభుత్వం బాటలోనే మందుబాబులకు గుడ్ న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భాంగా తెలంగాణ లో వైన్ షాప్స్ , రెస్టారెంట్స్ కు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వగా..ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా అలాగే అనుమతి ఇచ్చింది. నేడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ప్రతిరోజు 9 గంటల వరకే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. కాగా న్యూ ఇయర్ సందర్భాంగా సమయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల మందుబాబులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్‌హౌస్‌ పైవంతెనలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు.