ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

స్థలాల సేకరణ అసంబద్ధం: యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం


పేదల ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం తీసుకుంటున్న స్థల సేకరణ అసంబద్ధంగా ఉంటుంది. ఎక్కువమంది పంపిణీ చేసి గిన్నిస్‌ బుక్‌లో ఎక్కాలనే తాపప్రతయంలో చెరువ్ఞలు, కుంటలు, విద్యా,వైద్యసంస్థలు, అడవ్ఞలు,ఖాళీగాఉన్న ప్రైవేట్‌, ప్రభుత్వ ఆఖరుకు స్మశానాల స్థలాలు కూడా సేకరిస్తున్నారు. నీటి వనరులు అడుగంటడంతో ఇప్పటికే పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. వర్షాలు పడిన అరగంటకే గుబులు, ఉక్కపోతతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భవిష్యత్తులో పరిశ్రమ లు, ప్రభుత్వ,ప్రభుత్వేతర కార్యాలయాలు, వివిధసంస్థల అవ సరాలకు ఖాళీస్థలాలు మిగల్చకపోతే భావితరాలను శాపగ్రస్తు లుగా చేసిన అపకీర్తి మూటగట్టుకోవలసి ఉంటుంది. ఇదే దుస్థి తికొనసాగితే గిన్నిస్‌బుక్‌లోచరిత్రహీనులుగా లిఖించబడతారు.

సమన్యాయం పాటించాలి: గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

బహిరగంగా ఉమ్మితే కఠిన శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. అలాగే బహిరంగ మల,మూతవిసర్జనలపై కూడా కఠినంగావ్యవహరిస్తేనే ప్రజలు రోగాలబారిన పడకుండా జీవనం సాగించడానికి దోహదపడు తుంది. గత ప్రభుత్వం చాలా చిత్తశుద్దితో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జనను చాలా వరకు అడ్డుకున్న వైనం మరువలేం. అయితే ఇటీవల కాలంలో బహి రంగ మలవిసర్జన యధేచ్ఛగా కొనసాగించడం ఆందోళన కలిగి స్తున్నది.పాలకులు ఈ సాంఘిక దురాచారంపై దృష్టి పెట్టాలి. అలాగే నిబంధనలు అమలు పరచడంలో ద్వంద ప్రమాణాలు పాటించడం కూడా సబబుకాదు.లాక్‌డౌన్‌ నిబంధనల అమలు విషయంలోపాలకులుపూర్తిగాబాధ్యతారహితంగా వ్యవహరించ డం వలన ప్రజల్లో పాలకులపై విశ్వాసం లేకుండాపోతున్నది.

ప్రభుత్వం స్పందించాలి:పి.అంజనేయులు, నల్గొండ

కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో పురపాలక సంఘం కమిషనర్‌ ప్రభుత్వంనుండి ఎటువంటి సాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఓ ప్రభుత్వ వైద్యుడు వెల్లడించిన వైనం మరువక ముందే మరో బాధ్యత కలిగిన అధికారి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం నిజంగా సంచలనమే. కనీసం మాస్కూలు, బూట్లు, పిపిఇలు కూడా ఇవ్వకపోతే శానిటేషన్‌ ఎలా నిర్వహిచగలరో పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

లాక్‌డౌన్‌ పొడిగింపు సమర్థనీయం: డా.దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి


ప్రపంచమొత్తం వ్యాపించిన కరోనా హింసావాదాన్ని కొనసాగి స్తూ నిర్దాక్షిణ్యంగా అసువ్ఞలను హరిస్తూ ఉంది. విలయాన్ని సృష్టిస్తోంది. ఇట్టి పరిస్థితులలో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ను పొడిగించిన విధానాన్ని ముక్తకంఠంతో సమర్థించి, సూచనలను ప్రజలందరు పాటించి కరోనాను తరిమి ప్రధాని చర్యలకు సంపూర్ణ మద్దతు తెలపడం కర్తవ్యం. ప్రాణాలా? ఆర్థిక పరిపుష్టా? ఏది కావాలి? అనే సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో చక్కనైనా నిర్ణయాలు తీసుకోవడం సమర్థనీయం. పరిస్థితులు సద్దుమణిగేవరకు ప్రతిఒక్కరు అకుంఠితదీక్షతో కంకణబద్దులు కావాలి.

అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి:షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

అగ్నిమాపక కేంద్రాల కొరత ప్రజలను బాగా వేధిస్తుంది. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రాలు డివిజన్‌ కేంద్రాలకు పరిమితం అయ్యాయి. ఈ డివిజన్‌ కేంద్రాలు మారుమూల గ్రామాలకు చాలా దూరంలో ఉంటున్నాయి.పల్లెల్లో అగ్నిప్రమాదాలు సంభ విస్తే ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. రైతుల విలువైన పశుగ్రాసం అగ్నిప్రమాదానికి గురైతే డివిజన్‌ కేంద్రం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేటప్పటికి పూర్తి నష్టం జరిగి రైతులకు అన్యాయంజరుగుతుంది. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతుంది.కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

నిరుద్యోగిత శాతాన్ని తగ్గించాలి:క్రాంతికుమార్‌, హైదరాబాద్‌


నాలుగేళ్లు పుస్తకాలతోకుస్తీపడుతున్నారు.ఇంజినీరంగ్‌ పట్టా ను ఎలాగోలా పొందుతున్నారు.కానీ ఇంజనీర్‌గా ఉద్యోగం మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. కారణం ఇంగ్లీష్‌లో మాట్లాడం రాకపోవడం. దేశంలో ఏటా ఆరు లక్షల మంది ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారు. అందులో కనీస గ్రామర్‌తో మాట్లాడేది25శాతం,ప్రముఖకంపెనీలలోఉద్యోగం పొందేది 2.3శాతమే అని ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో ఈపరిస్థితి మరింత దారు ణంగా ఉందని, ఇక్కడి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌లలో సగం మందికిపైగా ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేదని గుర్తించింది. ఇంజనీరింగ్‌ కళాశాలలు లెక్కలేనన్ని ఉండటం, వాటిల్లో అధ్యాపకులు లేకపోవడం, నాణ్యతలేనిచదువ్ఞలు, తూతూ మంత్రంగా బోధించే విధానం, పరీక్షలు, ఎలా రాసిన పాస్‌ చేసేయడం వీటికి ప్రధాన కారణాలు.