ప్రజావాక్కు: సమస్యలపై గళం

నగరాలను మింగేస్తున్న కాలుష్యం: -కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

Voice of the People
Voice of the People

పట్టణాలలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, నగరవాసుల కు ప్రాణసంకటంగా మారుతోంది. లక్షల్లో పెరిగిన వాహనాల నుంచి నిత్యం వెలువడుతున్న దుమ్ము,ధూళి పట్టణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో ధూళి రేణువ్ఞలు అధికం కావడం వల్ల రోజూ బయట సంచరించే వారు వివిధ రకాల వ్యాధులకు గురవ్ఞతున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరగడం, పరిశ్రమల నుండి హానికరమైన వాయువ్ఞలు వాతావరణంలోకి వదలడంవలన భూతాపం పెరి గిపోతోంది.కాలుష్యంవల్ల హానికర వ్యర్థాలు చెరువ్ఞల్లో కలుపు తున్నారు.అవి నీటివనరులను కలుషితంచేసి నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వాహన కాలుష్యం, జలకాలుష్యం పెరగడం కారణంగా భూమి రోజురోజుకు వేడెక్కి, మొత్తం జీవరాశి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిస్థితి మరిత విషమించక ముందే అధికారులు మేల్కొని వాయు, జల కాలుష్యం నుండి నగరాలను కాపాడాలి.

అదనపు సిబ్బంది అవసరం: -టి.సి.సాంబశివరావ్ఞ, నర్సరావ్ఞపేట, గుంటూరుజిల్లా

తాము డిమాండుచేసినంత వేతనపెంపుదలకు ప్రభుత్వ యాజ మాన్యాలు అంగీకరించలేదని గతవారం బ్యాంకు ఉద్యోగులు రెండురోజులు సమ్మెచేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వేతన ఒప్పందాల యూనియన్లు తాము డిమాండ్లు చేసినంత పెంపుదలకోసమే పట్టుబట్టకుండా ఉద్యోగులపై నానాటికీ పెరిగిపోతున్న పనిఒత్తిడి తట్టుకోవడానికి అదనపు సిబ్బందిని కూడా గట్టిగా డిమాండు చేస్తే అన్ని వర్గాల మద్దతు లభిస్తుం ది. సమాజానికి మేలు చేకూరుస్తుంది. ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగాలంటే బట్ట నలగని వైట్‌కాలర్‌ ఉద్యోగాలని ఎంతో మక్కువ ఉండేది.కానీ రాజకీయ నాయకులు అధికారం కోసం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సరఫ రాతో బ్యాంకు సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవ్ఞతున్నారు. తగిన సిబ్బంది లేక సతమతమవ్ఞతున్నారు.

కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేయాలి: -ఆమంచర్ల ఉష, తిరుపతి

రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బావిద్యాలయాలను నెలకొల్పి ప్రభు త్వం తనవంతుగా కృషి చేయాలి. బడిమానేసిన పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథ బాలికలను వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగించి, ఇంటి నుంచి పారిపోయిన బాలికలకు కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో చేర్పించి వారికి ఉన్నత విద్యను అందించాలి.

కరోనా ఉపద్రవం: -డా.డి.వి.జి.శంకరరావ్ఞ, పార్వతీపురం

కరోనా వైరస్‌బారినపడి చైనా విలవిల్లాడుతోంది. లక్షలాది మందిప్రజలు ఇళ్లకే పరిమితం అవ్ఞతున్నారు. ఈ అంటువ్యాధి మొదట పుట్టిన వ్ఞహాన్‌ మహానగరం యావత్తూ మిగతా ప్రపంచంతో రాకపోకల్లేని దిగ్భందంలో ఉంది. వేలాది మందికి వైరస్‌సోకగా, వందలాది మంది మృత్యువాతపడ్డారు. జలుబు, దగ్గు, ఉపిరితిత్తుల వ్యాధిగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ చైనాతోపాటు పదిపన్నెండు దేశాల్లో ఉనికి చాటుకోగా దీనిని ప్రపంచ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకొమ్మని హెచ్చరించింది. చైనాలో ఈ వ్యాధి కనబడగానే చర్యలుతీసుకోకుండా ఒకనెలరోజులపాటు జాప్యం చేయడంతోవ్యాధి ముదిరినట్టువిమర్శలున్నా, పిమ్మట గైకొంటు న్నచర్యలు,స్పందన మాత్రం శ్లాఘనీయం. తొమ్మిది రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రి సకల సౌకర్యాలతో నిర్మించడంకానీ, మానవ వనరుల్ని సమాయత్తం చేయడం కానీ అమోఘం.

న్యాయస్థానంపై పెరిగిన విశ్వాసం: -కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట,భూపాలపల్లిజిల్లా

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ కేసులో సైకో మర్రి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ నల్గొండ జిల్లాలోని పోక్సో న్యాయస్థానం తీర్పు ఇవ్వడం చరిత్రాత్మకం. హాజీపూర్‌లోని ముగ్గురు బాలికలను అత్యాచారం,హత్యచేసి తన వ్యవసాయబావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిపై పోలీసులు నేరనిరూపణ చేయడం ఇద్దరుబాలికల కేసులలో ఉరిశిక్ష మరో బాలిక కేసులో యావజ్జీవకారాగారశిక్ష విధిస్తూ పోక్సోన్యాయస్థానం తుదితీర్పు వెలువరించడం ప్రతి ఒక్కరికి న్యాయవ్యవస్థపై నమ్మకం పెం చింది. హాజీపూర్‌ కేసుల్లో 90 రోజుల్లోనే న్యాయస్థానాలు విచారణ చేపట్టి దోషులకు ఉరిశిక్షలు విధించడంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసం పెరిగిందని భావించవచ్చు.

దశాబ్దాల నిరీక్షణలో బిసిలు: -వింజమూరు మస్తాన్‌బాబు,నెల్లూరు

సమాజంలో 50 శాతంపైబడిన హిందూ సామాజికవర్గాలు బిసిలు.వీరి ఓట్లబలం ఏ రాజకీయ పార్టీకైనా ఎంతో అవస రం.నాలుగు దశాబ్దాలుగా బిసి వర్గాలు తమ వెనుకబాటు తనంతో రాజకీయ తాబేదారులుగా ఆధిపత్య బిసి కులాల కు ఊడిగం చేయలేక ఆవేదనచెందుతున్నారు. బిసిల దుస్థి తిని రూపుమాపటానికి వివిధ బిసి కమిషన్లను ఏర్పాటు చేసినా వాటి పనితీరులో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. బిసిలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/