దేశాలపై వివక్ష చూపే విధానానికి తెర

వాషింగ్టన్‌: అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా వీసాలపై ట్రంప్‌ విధించిన ఆంక్షలు తొలగించి పాత వలస విధానాన్ని అమలుచేసేందుకు సుముఖంగా ఉన్నారని వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. కొద్దివారాలుగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అవి ఆరంభం మాత్రమేనని చాలా విధానాల్లో కీలక మార్పులు ఉంటాయని వైట్‌హౌస్‌ సీనియర్‌ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అమానవీయ, అనైతిక, వర్గాలవారీగా విభజించే విధానాలను సవరించే పనిలో అధ్యక్షుడు ఉన్నారని వెల్లడించారు. అమెరికాలో శాశ్వత నివాసం, గ్రీన్‌కార్డు జారీకి ఉన్న పరిమితిని తొలగించేవరకు భారత్‌లో జన్మించినవారికి హెచ్‌1బీ వీసా ఇవ్వొద్దని ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌ పిలుపు నేపథ్యంలో వైట్‌హౌస్‌ వర్గాలు ఈమేరకు ప్రకటన చేశాయి.