అలా అయితే కుంబ్లే 900 వికెట్లు సాధించేవాడు

భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌

goutham gambhir

న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌, భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే గురించి పలు అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్నటువంటి డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌( డిఆర్‌ఎస్‌) పద్దతి భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే ఆడే సమయంలో ఉండి ఉంటే అతను 900 టెస్ట్‌ వికెట్లు సాధించే వారని గంభీర్‌ అన్నాడు. అదే సమయంలో హర్బజన్‌ సింగ్‌ ఖాతాలో కూడా మరిన్ని వికెట్లు ఉండేవని గంభీర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ రోజుల్లో డిఆర్‌ఎస్‌ పద్దతి లేకపోవడం వల్ల కుంబ్లే, హర్బజన్‌లకు చాలా వికెట్లు చేజారిపోయాయని అన్నారు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో ఎక్కువ వికెట్లు నష్టపోయినట్లు తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/