అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం
పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన రస్సెల్

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ ఐపిఎల్‌పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. తాజాగా కేకేఆర్ ఫ్రాంచైజికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. ఇతర ఆటలతో పోలిస్తే ఐపిఎల్ ఆడే సందర్బంలోనే తనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పుకొచ్చాడు. తన చివరి ఐపిఎల్ మ్యాచ్ వరకు కేకేఆర్ తోనే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. గత ఆరు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. వరుసగా రెండు మ్యాచులలో విఫలం అయినప్పటికి తదుపరి మ్యాచ్‌లో అదే రీతిలో స్వాగతిస్తారు అని అన్నాడు. కేకేఆర్ తరపున చివరి మ్యాచ్ ఆడుతున్నపుడు అందరూ వినండి ఇదే నా చివరి ఐపిఎల్ మ్యాచ్ అంటూ అందరికి చెప్తానని రస్సేల్ అన్నాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/