స్విస్ ఓపెన్ విజేత పీవీ సింధు

ఈ ఏడాదిలో రెండవ టైటిల్

Swiss Open winner PV Sindhu
Swiss Open winner PV Sindhu

స్విస్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీ భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు విజేత‌గా నిలిచింది. కాగా, ఇటీవల జర్మన్​ ఓపెన్​, ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​లో ఓడిన పీవీ సింధు స్విస్​ ఓపెన్​లో బాగా రాణించింది. ఆదివారం జరిగిన ఫైనల్​లో బుసానన్‌పై 21-16, 21-8 స్క్రోర్ తేడాతో విజయం సాధించి టైటిల్​ను చేజిక్కించుకుంది. దీంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో రెండు టైటిల్స్​ చేరాయి. ఈ మ్యాచ్ 49 నిమిషాల పాటు సాగింది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/