అత్యుత్తమ ఫినిషర్‌ ధోని: మైక్‌ హస్సీ

ఆత్మవిశ్వాసం, అసాధారణ శక్తి అతడిని అత్యుత్తమ స్థానానికి చేర్చాయి

ms dhoni
ms dhoni

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రీడా టోర్నీలు అన్ని రద్దు కావడంతో క్రికెటర్‌లు అందరు ఇళ్లలో గడుపుతు ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేస్తున్నారు. తాజాగా వ్యాఖ్యాత ముంజ్రేకర్‌ తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ మాట్లాడుతు ధొని పై ప్రశంశల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో ధోని ని మించిన ఫినిషర్‌ మరోకరు లేరని అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్లో కష్టసాధ్యమైన లక్ష్యం ఉన్నప్పటికి క్రీజులో ఉన్నాడంటే అందరికి అదో భరోసా. అందుకే ప్రపంచ క్రికెట్‌లో ధోనిని మించిన ఫినిషర్‌ లేడని హస్సీ అన్నాడు. అసాధారణ శక్తి, ఆత్మవిశ్వాసమే ధోనిని అత్యున్నత స్థానానికి చేర్చాయని హస్సీ పేర్కోన్నాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/