చంద్రబాబును కలిసిన వైస్సార్సీపీ ఎంపీ

నరసాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ..ఢిల్లీ లో టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు. త్వరలోనే టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారితో పాటు వైస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘు రామ సైతం తన పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు .. పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత.. ఎంపీల రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. వైస్సార్సీపీ ఫై ఒత్తిడి తేవాలి అన్నా.. ప్రస్తుతం ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాస్ చేసుకోవాలన్నా.. రాజీనామాలాంటి సంచలన నిర్ణయమే మేలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుంది..? అనేది చూడాలి.