నారా లోకేష్ యువగళం నేటి పాదయాత్ర షెడ్యూల్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికీ 29 వ రోజుకు చేరింది. గత నెలలో కుప్పం లో ప్రారంభమైన ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ కార్య కర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు లోకేష్. ఇప్పటి వరకు 367.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేష్.. నిన్న (ఆదివారం) 13.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు చంద్రగిరి నియోజవర్గం చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్ర నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

ఈరోజు షెడ్యూల్ విషయానికి వస్తే..

8:00 – చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9:15 – శానంబట్ల గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

10:20 – పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

10:45 – తొండవాడ బహిరంగసభలో యువనేత ప్రసంగం.

11:45 – తొండవాడలో భోజన విరామం.

12:45 – భోజనవిరామ ప్రాంతంలో స్థానికనేతలతో అంతర్గత సమావేశం.

సాయంత్రం:

3:00 – తొండవాడనుంచి పాదయాత్ర కొనసాగింపు.

4:30 – చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

5:05 – చంద్రగిరి నూర్ జంక్షన్ లో స్థానికులతో భేటీ.

6:55 – ఇత్తెపల్లిలో స్థానికులతో మాటామంతీ.

7:45 – మామందూరు విడిది కేంద్రంలో బస.