మహిళలు తమ అమ్మ, అత్తమ్మకు బానిసలు కారు: కేరళ హైకోర్టు

అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలన్న కుటుంబ న్యాయస్థానం

Women Are Not Slaves Of Mothers, Mothers-In-Law: Kerala HC

తిరువతనంపురంః ఓ మహిళ విడాకుల కేసు సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల నిర్ణయాలు వారికంటే తక్కువేమీ కాదని స్పష్టం చేసింది. మహిళలు వారి అమ్మలకు, అత్తమ్మలకు బానిసలు కారని పేర్కొంది. ఓ మహిళ విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టి వేయగా, దీన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివాహ పవిత్రతకు అనుగుణంగా తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సదరు జంటకు కోర్టు సూచించింది.

ఫ్యామిలీ కోర్డు ఆదేశాలను హైకోర్టు తప్పుబట్టింది. ఇవి పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది నేటి నీతి కాదంటూ, ఇది కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యలు చేసింది. బాధిత మహిళ ఈ అంశంలో తన అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలంటూ కుటుంబ న్యాయస్థానం చెప్పిన విషయాన్ని భర్త తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. మహిళ నిర్ణయాలు, తన అమ్మ లేదంటే అత్తమ్మ కంటే తక్కువేమీ కాదని పేర్కొన్నారు. వీరి మధ్య విభేదాలు సులభంగానే, కోర్టు బయట పరిష్కరించుకోగలిగినవిగా స్పష్టం చేశారు.