నానక్ రామ్ గూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

నానక్ రామ్ గూడలో దారుణం జరిగింది. మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్.. హైదరాబాద్ లోని అమెజాన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలి నుంచి నానక్ రామ్ గూడ లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి నివసిస్తోంది.

రూమ్ మేట్స్ లో ఒకరు ఢిల్లీకి వెళ్లగా.. మరొకర ఆఫీస్ కు వెళ్లారు. ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్న కృతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన స్నేహితుడు సచిన్ కుమార్ కు తాను చనిపోతున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేసింది. మెసేజ్ చూసి వెంటనే అతను ప్లాట్ కు వచ్చి చూసే సరికి తాళం వేసి ఉంది. దీంతో ఫోన్ చేశాడు. అయినా స్పందించకపోవడంతో అతను కృతి రూమ్ మేట్ కు ఫోన్ చేశాడు. ఆమె తాళం పంపించింది. దాంతో తలుపులు ఓపెన్ చూసి చూడగా కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె స్నేహితులు ఆస్పత్రికి తరలించగా కృతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.