సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన కాట్రెల్

బార్బడోస్: గురువారం అర్ధరాత్రి బార్బడోస్ వేదికగా ఐర్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 237 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని వెస్టిండీస్ కేవలం ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగా టార్గెట్‌ను ఛేదించింది. టెయిలెండర్ హేడెన్ వాల్ష్ 46 నాటౌట్ అద్భుత పోరాటంతో ఆకట్టుకోగా, మరో టెయిలెండర్ షెల్డాన్ కాట్రెల్ సిక్స్‌తో విండీస్‌కు విజయాన్ని అందించాడు. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరం కాగా, ఐర్లాండ్ వికెట్ తీస్తే విజయం సాధిస్తుంది. ఈ తరుణంలో వాల్ష్-కాట్రెల్ జోడి సమయోచితంగా ఆడింది. మార్క్‌్ అడైర్ వేసిన 50 ఓవర్ తొలి బంతికి వాల్ష్ పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి పరుగుతీశాడు. ఇక మూడో బంతికి కాట్రెల్ సింగిల్ తీశాడు. నాల్గో బంతికి వాల్ష్ పరుగు తీయగా, కాట్రెల్ స్టైకింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి రెండు పరుగులు అవసరం. అయితే కాట్రెల్ మాత్రం సిక్స్‌తో అదిరేటి ఫినిషింగ్ ఇచ్చాడు. స్వీపర్ కవర్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. మ్యాచ్ చేజారిపోయిందన్న తరుణంలో కాట్రెల్ సిక్స్ కొట్టడంతో విండీస్ శిబిరంలో ఆనందం అంబరాన్ని తాకింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/