పవన్ రీమేక్ లో స్టార్ డైరెక్టర్ కీలక రోల్
సాలిడ్ క్యారెక్టర్ లో వివి వినాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రాల్లో క్రేజీ అండ్ మాస్ రీమేక్ చిత్రం ‘అయ్యప్పణం కోషియం’ రీమేక్ ఒకటి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రముఖ స్టార్ దర్శకుడు వివి వినాయక్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇది నిజమే నిజమే అన్నట్టు కూడా తెలిసింది. వినాయక్ రోల్ పవన్ తో పాటు సాలిడ్ రోల్ చేస్తున్న రానాకు దగ్గరగా ఉంటుందట. థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/