థియేటర్ యజమాని కాళ్లు మొక్కిన విజయ్ దేవరకొండ

లైగర్ హీరో విజయ్ దేవరకొండ ..థియేటర్ యజమాని కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఇదే టాక్ వచ్చింది. ఈ క్రమంలో సినిమా డిజాస్టర్ కావడానికి కారణం విజయ్ దేవరకొండే అని ముంబై లోని ఓ థియేటర్ యజమాని తెలిపాడు.

ముంబయికి చెందిన థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన సినిమాను బాయ్ కాట్ చేసుకోండంటూ చెప్పి తెలివిని ప్రదర్శించానని అనుకున్నాడని.. అతడి ప్రవర్తన కారణంగా సినిమాను ఓటీటీలో కూడా చూడరని తెలిపారు. నీ ప్రవర్తన వల్ల మేం నష్టపోతున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా ఎఫెక్టు పడింది. మిస్టర్ విజయ్.. నువ్వు కొండవి కావు అనకొండవి. అనకొండలానే మట్లాడావు. వినాశకాలే విపరీతబుద్ధి అంటారు.నాశనమయ్యే సమయం దగ్గర పడ్డప్పుడు.. నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. నువ్వు అలాగే మాట్లాడావు కూడా. నువ్వు చాలా అహంకారివి.. నచ్చితే చూడండి.. ఇష్టం లేకపోతే అసలు చూడొద్దు లాంటి మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావటం లేదా?” అంటూఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

దీంతో విజయ్ దేవరకొండ ముంబై చేరుకుని మనోజ్ దేశాయ్ ను కలుసుకున్నాడు. తన వ్యాఖ్యల్లోని ఉద్దేశ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తాను ప్రేక్షకులను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను సందర్భోచితంగా తీసుకోవాలని కోరాడు. విజయ్ దేశాయ్ పాదాలకు నమస్కరించాడు. దీంతో విజయ్ పట్ల అపార్థాన్ని విజయ్ దేశాయ్ తొలగించుకున్నారు. క్షమాపణ చెప్పారు.

‘‘అతడు నిజంగా మంచి వ్యక్తి. ఒదిగి ఉండే వ్యక్తి. నేను అతడ్ని ఇష్టపడుతూనే ఉంటా. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను ఈ సందర్భంగా ఇస్తున్న హామీ ఏమిటంటే అతడి సినిమాలు అన్నింటినీ నేను ప్రదర్శనకు తీసుకుంటాను. అతడికి అంతా మంచే జరగాలి’’ అంటూ మనోజ్ దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు.