పెళ్లి ఫై కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda

పెళ్లి చూపులు , గీత గోవిందం , అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా తన పెళ్లి ఫై ఓపెన్ అయ్యారు. ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్న విజయ్.. తన పెళ్లి ఫై కామెంట్స్ చేసాడు. తన కంటే ముందు తమ్ముడి పెళ్లి ఉంటుందంటూ సరదాగా కామెంట్ చేసాడు.

ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రొమోషన్లను స్పీడ్ చేసారు.

ఈ తరుణంలో దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను విజయ్ షేర్ చేసారు. ఈ వీడియో లో తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ సరదాగా చెప్పారు. అయితే విజయ్ దేవరకొండ తనకంటే ముందు తన తమ్ముడికే పెళ్లి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం ఈ వీడియో లో హైలైట్ గా నిలిచింది.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే..పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ముంబై లో జరుగుతుంది.