పవన్ కళ్యాణ్ కు జనవాణి తెలియదు…ధన వాణి మాత్రమే తెలుసు – వెల్లంపల్లి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేత , మాజీ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ కు జనవాణి తెలియదు…ధన వాణి మాత్రమే తెలుసన్నారు. అంతే కాదు మూడేళ్లు కుంభకర్ణుడుగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా.. ? అని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం విజయవాడ కేంద్రంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధినేత చేపట్టారు. మొత్తం ఐదు వారాల పాటు రాష్ట్రంలో ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. పెద్ద సంఖ్యలో అర్జీలు పట్టుకుని ప్రజలు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. ప్రజలు తమ వెతల్ని జనసేనానికి చెప్పుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి క్యూ కట్టారు. దీనిపై వైసీపీ నేత వెల్లంపల్లి కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చాయా అన్నారు.

డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అగ్రహించారు. ఒక్క పది రోజుల ఏపీలో నిద్ర తీసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలని మాజీ మంత్రి వెల్లంపల్లి చురకలు అంటించారు. అలాగే వైస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ రెడ్డి పై వెల్లంపల్లి పలు ఆరోపణలు చేసారు. పోలవరం నుంచి ఈ మూడేళ్లలో ఏం చేశాం అనే అంశాల ప్రదర్శన ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెప్పాలని ప్రజలు ప్లీనరీకి రానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు 8, 9 తేదీలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతో ఉంటే తప్పేంటి?? అని నిలదీశారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. పనికి మాలిన ఎంపీ మాటలను, పకోడి రామకృష్ణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.