వర్మ మళ్లీ ట్విట్టర్ వార్ మొదలుపెట్టాడు

రామ్ గోపాల్ వర్మ మళ్లీ ట్విట్టర్ వార్ మొదలుపెట్టాడు. గత కొద్దీ రోజులుగా సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సర్కార్ తో ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్న వర్మ..సోమవారం మంత్రి పేర్ని నాని తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత టికెట్ ధరల ఫై ఓ క్లారిటీ వస్తుందని అంత అనుకున్నారు. కానీ ఈ భేటీ చిత్రసీమకు ఏమాత్రం కలిసిరాలేదని అర్ధమవుతుంది. ఈ తరుణంలో వర్మ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆర్జీవీ తాజాగా ‘కట్టప్పను ఎవరు చంపారు ?’ అంటూ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా మళ్ళీ మొదలెట్టారు. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

”రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఉంది. ఎక్కడ సినిమా టికెట్ ధర రూ. 2200/-లకు అమ్ముతున్నారు ? అని ప్రశ్నించే వాళ్ళకి… ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది. కానీ, సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది… “కట్టప్పను ఎవరు చంపారు? ” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.