రేపు హైద‌రాబాద్‌ పర్యటనకు రానున్న అమిత్ షా

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. రేపు అమిత్ షా ముచ్చింత‌ల్‌కు రానున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 4:40 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింత‌ల్‌కు చేరుకుంటారు.

ముచ్చింత‌ల్‌లోని స‌మతామూర్తి కేంద్రాన్ని సంద‌ర్శించి, రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం 108 దివ్య క్షేత్రాల‌ను ప‌రిశీలించి, వివ‌రాల‌ను అడిగి తెలుసుకోనున్నారు. యాగ‌శాల పూజ‌ల్లో పాల్గొన‌నున్నారు. రాత్రి 8 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి అమిత్ షా తిరిగి వెళ్ల‌నున్నారు. అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ముచ్చింత‌ల్‌, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/