మళ్లీ బెల్‌బాటమ్‌ స్టైల్‌

ఫ్యాషన్‌: ఫ్యాషన్‌

Bellbottom style again
Bellbottom style again

నిన్న మొన్నటివరకూ స్లిమ్‌ ఫిట్‌ జీన్స్‌, లెగ్గింగ్సూ, ప్యాంట్లూ, చుడీప్యాంటులతో బిర్ర బిగుసుకుపోయిన యువతకి ఈమధ్య కాస్త హాయిగా వదులుగా గాలి పోసుకునే ఫ్యాషన్ల మీదకి మనసు మళ్లింది.

దాంతో పాటియాలా, పలాజో, స్కర్టుపలాజో, లూజు ప్యాంటుల జోరు పెరిగింది. అయితే ఎప్పుడూ పైనుంచి కింది వరకు ఒకేరకమైన వదులుతో వేసుకున్నా ఏం మజా ఉంటుంది.

అందుకే వాళ్లకోసం కాలచక్రాన్ని గిర్రున తిప్పేసి అందులోంచి బెల్‌బాటమ్‌ ప్యాషన్‌ని చటుక్కున పట్టేశారు

నవ డిజైనర్లు, ఇక, ఆపై చెప్పేదేముంది..యువత మెచ్చే జీన్సుల్లో లెగ్గింగుల్లో సల్వారుల్లో ట్రౌజర్లలో అనింనటా నాటి రెట్రోహిప్పీ బెల్‌బాటమ్‌ మళ్లీ తెరమీద కొచ్చేసింది.

అయితే ఈసరి అబ్బాయిలకన్నా అమ్మాయిల ఫ్యాషన్లలోనే బెల్‌బాటమ్‌ ఎక్కువగా హొయలొలికించడం విశేషం.

అసలయితే ఈ బెల్‌బాటమ్‌, 17వ శతాబ్దంలో పడవల్లో ప్రయాణించే నావికుల కసం వచ్చిందట. వాళ్లు నీళ్లలోకి దిగినప్పుడు ప్యాంటుల్ని పైకి మడుచుకునే సౌకర్యం కోసం అలా కుట్టారట.

అయితే అప్పట్లో అమెరికా, ఐరోపా దేశాల్లో నౌకా సైన్యం కోసం రూపొందించిన వాటిల్లో మిగిలిపోయిన వాటిని సెకెండ్‌హ్యాండ్‌ దుకాణాల్లో తక్కువ ధరకు విక్రయించేవారు.

దాంతో చాలామంది యువత వీటిని ధరించడంతో అప్పట్లో అదో కొత్త ఫాగీషన్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది.

అది హిప్పీ బాబులకీ పాప్‌సింగర్లకీ కూడా తెగ నచ్చేయడంతో ఆ బెల్‌బాటమ్‌ ప్యాంటుల మీదకి టై అండ్‌ డై షర్టుల్నీ రంగుకళ్లద్దాల్నీ జోడించి మరీ ఆ ఫ్యాషన్‌ని మరింత పాపులర్‌ చేసేశారు.

అలా అది సముద్రాలూ ఖండాలూ దాటి ప్రాచుర్యం పొంది, హాలీవుడ్‌, బాలీవుడ్‌,టాలీవుడ్‌ తేడా లేకుండా దాదాపు రెండు దశాబ్దాలపాటు రాజ్యమేలి, ఆపై తొంభైలలో ఓసారి తళుక్కున మెరిసి, క్రమంగా తెరమరుగైంది.

మళ్లీ ఇప్పుడు మూనీసెక్స్‌ ఫ్యాషన్‌గా సీనులోకి వచ్చింది. డెనిమ్‌, కాటన్‌, శాటిన్‌, పాలీయెస్టర్‌ ఇలా ఫ్యాబ్రిక్కుతో సంబంధం లేకుండా అన్నిరకాల ప్యాంటుల్లోనూ బెల్‌ కుట్టేస్తున్నారు.

నేటి డిజైనర్లు. క్రమంగా ఆ బెల్‌ సందడి ఫ్యాషన్‌ వేదికల్ని దాటి. తారాలోకాన్నీ తెగ హుషారెత్తించింది. దాంతో తెరమీదే కాదు, క్యాజువల్‌వేర్‌లోనూ బెల్స్‌తో అడుగులేసేస్తున్నారు.

నటీనటులు మీ బాటలోనే మేం కూడా అంటే కాలేజీ బాబులూ పాపులూ కూడా వాటితో హుందాగా నడిచేస్తున్నారు.

అక్కడితో ఆగితే సీను సీతారకెక్కదు కదా అందుకే భలారే బెల్‌బాటమ్‌..అంటూ స్టెప్పులేసేడానికీ రెడీ.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/