పండుమిర్చి చికెన్‌

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Chili Chicken
Chili Chicken

కావలసిన పదార్థాలు:

చికెన్‌ ముక్కలు: అరకిలో, పండుమిర్చిముద్ద- టేబుల్‌స్పూను, ఎండుమిర్చి- రెండు, ఉల్లిముద్ద-అరకప్పు, వెల్లుల్లిముద్ద-2 టేబుల్‌సూన్పు
అల్లంతురుము- 2 టేబుల్‌స్పూన్లు,
దాల్చినచెక్క-2 అంగుళాల ముక్క
దనియాలపొడి-2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు- తగినంత
నెయ్యి లేదా నూనె- 2 టేబుల్‌స్పూన్లు

తయారు చేసేవిధానం

చికెన్‌ముక్కలకు ఉప్పు, పండుమిర్చి ముద్ద, ఉల్లిముద్ద
బాణలిలో నెయ్యి వేసి ఎండుమిర్చి వేగాక అల్లంతురుము వేసి వేగనివ్వాలి. తరువాత చికెన్‌ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు దాల్చినచెక్క పొడి, దనియాలపొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉండికించి దించాలి.

Spicy Chicken‌

స్పైసీ చికెన్‌

కావలసిన పదార్థాలు

చికెన్‌ముక్కలు: అరకిలో, టోమాటోప్యూరీ- కప్పు
కారం- 2 టేబుల్‌ స్పూన్లు
మిరియాల పొడి- టీస్పూను
జీలకర్రపొడి- టీస్పూను, ఉప్పు- తగినంత
బ్లాక్‌సాల్ట్‌- చిటికెడు, కొత్తిమీర తరుము- టేబుల్‌
స్పూను, పుదీనా తురుము- టేబుల్‌స్పూను, టొమాటో ముక్కలు- కప్పు, పచ్చిమర్చి- నాలు
అల్లం తురుము-టీస్పూను, ఆవనూనె-2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిగింజలు-టీస్పూను
కరివేపాకు-2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు-తగినంత

తయారు చేసేవిధానం

బాణలీలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర వాత టొమాటో ముక్కలు వేసి మగ్గిన తరవాత చికెన్‌ ముక్కలు వేయాలి. అవి కాస్త ఉడికిన తరవాత గొమాటో ముద్ద వేసి కలపాలి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/