ప్రారంభమైన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్: సీఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. సమావేశంలో ప్రత్యేకించి ఉద్యోగుల వేతన సవరణ ఫైల్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే, వానకాలం పంటలు, సాగునీటి పారుదల అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపింది? తీసుకోవాల్సిన చర్యలేంటి? తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/