విగ్ర‌హాల‌ను ధ్వంసం పై ట్రంప్ కీలక ఆదేశాలు

విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తే.. జైలులో వేయండి .. ట‌్రంప్‌

trump

వాషింగ్టన్ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ విగ్ర‌హాల‌ను ధ్వంసం పై తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసేవారిని జైలులో వేయాల‌ని ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేశారు. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసిన వారిని.. చ‌ట్టం ప్ర‌కారం శిక్షించాల‌ని ఆయ‌న త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. ఆందోళ‌న‌కారులు ఆగ‌డాల‌ను నిలిపు చేయ‌లేక‌పోతున్న పోలీసు శాఖ‌ల‌కు స్థానికంగా ఫెడ‌ర‌ల్ ఫండ్స్ ఆపేయాల‌ని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాను క‌నుగొన్న క్రిస్టోఫ‌ర్ కొలంబ‌స్‌తో పాటు అనేక మంది ప్ర‌ముఖ వ్య‌క్తుల విగ్ర‌హాల‌ను ఫ్లాయిడ్ మృతికి వ్య‌తిరేకంగా న‌ల్ల‌జాతీయులు కూల్చివేస్తున్నారు. విగ్ర‌హాల‌ను కూల‌గొడుతున్న వారు వామ‌ప‌క్ష తీవ్ర‌వాదుల‌ని, మార్కిస్టు భావాలు క‌లిగిన వారు అమెరికా విద్రోహాలు అని ట్రంప్ అన్నారు. చ‌రిత్ర‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా నిరస‌న‌కారులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/