మునుగోడు ఉప ఎన్నికల్లో మరో టిఆర్ఎస్ నేత నామినేషన్

trs women leaders swapna filed nomination

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రభాకర్ రెడ్డి మాత్రమే నామినేషన్ వేశారని అంత అనుకున్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీ నుండి మరో నేత కూడా మునుగోడు ఉప ఎన్నిక లో నామినేషన్ వేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షురాలు మండల ప్రధాన కార్యదర్శి మూదాం స్వప్న నామినేషన్ దాఖలు వేసిన విషయం బయటకు వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ సొంత పార్టీ నాయకురాలు మునుగోడులో నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఈమె విత్ డ్రా చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.