‘బుల్లెట్ బండి’ పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య అదిరిపోయే స్టెప్స్

‘బుల్లెట్ బండి’ ఇప్పుడు ఈ పాట ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది. సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాటను పాడుతూ..వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. రీసెంట్ గా తెరాస ఎంపీ కవిత పెళ్లి వేడుకలో ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేయగా..తాజాగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కూడా స్టెప్పులు వేశారు.

జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు డాన్సు వేస్తుంటే బుల్లెట్ పాట రాగానే స్టేజ్ పైకి వెళ్లి చిన్నారులతో కలసి కాలు కదుపుతూ.. చేతులు తిప్పుతూ.. తానే తిరుగుతూ.. హుషారుగా డ్యాన్స్‌లు వేశారు. ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.